ఏపీ సచివాలయ ఉద్యోగులకు అలర్ట్

-

ఏపీ సచివాలయ ఉద్యోగులకు అలర్ట్.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఇవాల్టి నుంచి జూన్ 3వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉద్యోగులు తమ రోజువారి హాజరు నమోదు చేసుకునే HRMS పోర్టల్ లోనే బదిలీ దరఖాస్తుల లింక్ అందుబాటులో ఉంది.

ఖాళీల వివరాలను ఇప్పటికే ప్రకటించగా… ఉద్యోగుల దరఖాస్తుల పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ, బదిలీల తుది జాబితా వంటివి జూన్ 10వ తేదీలోగా పూర్తి చేయనున్నారు. ఇది ఇలా ఉండగా, ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం కింద 2023-24 విద్యాసంవత్సరంలో అన్ని ప్రైవేట్ స్కూళ్లలో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థులు మే 30లోగా స్కూళ్ల లో చేరాలి. గతంలో ప్రక టించిన షెడ్యూల్ గడువు నిన్నటితో ముగియగా… విద్యార్థుల కోసం గడువు పెంచారు. ఎంపికైన విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తుంది. 25% సీట్లలో అనాధ, HIV బాధితుల పిల్లలు, దివ్యాంగులకు 5%, ఎస్సీలకు 10%, ఎస్టిలకు 4%, బలహీన వర్గాలకు 6% సీట్లు కేటాయిస్తారు.

 

Read more RELATED
Recommended to you

Latest news