పక్కలేసి పార్టీని లాక్కున్నారు.. టీడీపీపై అంబటి సంచలన ట్వీట్

-

ఏపీ మంత్రి అంబటి రాంబాబు, టీడీపీల మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. తాజాగా టీడీపీ పార్టీ నేతల పై అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్విమ్మింగ్ పూల్ లో చిల్ అయ్యే చినబాబు.. పక్కలేసి పార్టీని లాక్కున్న పెదబాబు అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు.

చింతకాయల సోంబేరి, వంకాయల బనిత, ఈనాడు+ఆంధ్రజ్యోతి+టీవీ5 నా క్యారెక్టర్ మీద ఎంత రాసిన..ఎంత కూసినా.. ఎంత మొరిగినా నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు అంటూ ఫైర్‌ అయ్యారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. మీరందరూ నా వెంట్రుకతో సమానమంటూ సవాల్‌ చేశారు అంబటి రాంబాబు. ఈ బట్టతల బడుద్ధాయి పుట్టుకతోనే సంస్కారహీనుడు కొత్తగా చేయాల్సింది లేదని విమర్శించారు.

ఇక అంతకు ముందు అంబటి రాంబాబుపై టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన ట్వీట్‌ చేశాడు. ఓ ప్రముఖ యూట్యూబ్ యాంకర్ తో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అంబటి రాంబాబు అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. ట్వీట్‌ చేశాడు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. ఈ మేరకు ఆ ప్రముఖ యూట్యూబ్ యాంకర్ ఫోటోను షేర్‌ చేశాడు అయ్యన్న.

Read more RELATED
Recommended to you

Latest news