ఏపీలో వారికి జగన్ సర్కార్ శుభవార్త.. ఒక్కో అకౌంట్‌లో రూ.24 వేలు

ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. కృష్ణా జిల్లాలోని పెడనలో వైయస్సార్ నేతన్న నేస్తం నాలుగో విడత పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు.

ఈ సందర్భంగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు సీఎం జగన్. దీంతో వైయస్సార్ నేతన్న నేస్తం కింద ఈ సందర్భంగా 80,546 మంది ఖాతాల్లో రూ. 24 వేల చొప్పున రూ.193.31 కోట్లను సీఎం జగన్‌ జమ చేయనున్నారు. అనంతరం లబ్ధిదారులతో సీఎం జగన్ ముఖాముఖిలో పాల్గొంటారు. ఆ తర్వాత గ్రామదర్శిని కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం.

బంటుమిల్లి బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. ఇదిలా ఉండగా నిన్న సీఎం వైయస్‌ జగన్‌ ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా చీమకుర్తిలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాల ఆవిష్కరణలో పాల్గొన్నారు సీఎం వైయస్‌ జగన్‌. అనంతరం బహిరంగ సభలో సీఎం వైయస్‌ జగన్‌… ప్రసంగించారు.