ఏపీ బడ్జెట్ సమావేశాలు..ఈ బిల్లులపైనే చర్చ

ఏపీ బడ్జెట్ సమావేశాలు… కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానుంది ఏపీ శాసనసభ. డిమాండ్స్ కి గ్రాంట్స్ పై మొదటగా ఓటింగ్ జరుపనున్నారు. ఇవాళ అసెంబ్లీ సభలో ఐదు బిల్లులను ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం.

ఏపీ చుక్కల భూముల సవరణ బిల్లు, ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదారు పాస్ బుక్స్ సవరణ బిల్లులపై స్వల్ప కాలిక చర్చ జరుగనుంది. ఇనామ్ భూముల సవరణ బిల్లు, వ్యాట్ బిల్లు, ఏపీ పారా వెటనరీ అండ్ అలైడ్ కౌన్సిల్ బిల్లు విశాఖ జీఐఎస్ సదస్సు- పెట్టుబడులు -యువత -ఉద్యోగ అవకాశాలు అంశం పై స్వల్ప కాలిక చర్చ జరుగనుంది.