ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంపై కేంద్రం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి గానే గుర్తించింది. అంతే కాకుండా అమరావతి పేరుతోనే ప్రొవిజన్ ను కూడా పెట్టింది. కాగ ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు బిల్లు వెనక్కి తీసుకోవడంతో.. రాజధానిగా అమరావతినే గుర్తించింది. అంతే కాకుండా ఏపీ రాజధాని అమరావతిని నిర్మాంచాలని, అభివృద్ధి చేయాలని నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
కాగ ఇటీవల జరిగిన 2022 – 23 బడ్జెట్ సమావేశాల్లోనే రాజధాని నిర్మాణానికి నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. సచివాలయ నిర్మాణానికి రూ. 1,214 కోట్లు, ఉద్యోగుల నివాస గృహాల నిర్మాణం కోసం రూ. 1,126 కోట్లుగా కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. అలాగే జీపీఓఏ భూసేకరణ వ్యయం గా కూడా రూ. 6.69 కోట్లు గా కేంద్ర అంచనా వేసింది. కాగ తాజా గా రాష్ట్ర రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించడంతో రాష్ట్రానికి కాస్త ఊరట లభించింది.