ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని పాత రోజుల్లో సామెత చెప్పేవారు..ఆ సామెత అర్ధం ఏంటో అందరికీ తెలిసిందే…ఇక ఆ సామెత లాగానే..అసలు రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు లేవు…ఇంకా ఎన్నికలకు రెండేళ్లుపైనే సమయం ఉంది..కానీ ఈలోపే సర్వేలు వచ్చేస్తున్నాయని, ఇంకా టీడీపీ విజయం ఎవరు ఆపలేరని తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు.
పైగా ఎవరికెన్ని సీట్లు వస్తాయో కూడా చెప్పేస్తున్నారు…
టీడీపీ-జనసే
ఇక ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది..ఒకవేళ టీడీపీ-జనసేనలు గాని పొత్తులో పోటీ చేస్తే…175కి రికార్డు స్థాయిలో 165 సీట్లు సాధించి అధికారంలోకి వస్తాయని చెబుతున్నారు. పాపం వైసీపీకి ఓ 10 సీట్లు వస్తాయని చెబుతున్నారు..అంటే గత ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన 151 సీట్ల రికార్డుని టీడీపీ-జనసేనలు తిరగరాస్తాయన్నట్లు అంటున్నారు. ఇదంతా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.
ఇంకా ఈ సర్వేలో నిజముందో లేదో జనాలకే అర్ధం కావాలి..ఎందుకంటే ఏపీలో ఇప్పటికీ వైసీపీ స్ట్రాంగ్‌గా ఉంది..అలా అని టీడీపీ మరీ వీక్ గా లేదు..టీడీపీ కూడా చాలావరకు పుంజుకుంది…కానీ వైసీపీని డామినేట్ చేసే స్థాయికి మాత్రం టీడీపీ రాలేదని మాత్రం అర్ధమవుతుంది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లోపు ఏమన్నా పరిస్తితులు మారే ఛాన్స్ ఉంది తప్ప..ఇప్పుడు తమ్ముళ్ళు చెప్పే సర్వేల్లో నిజం లేదనే చెప్పొచ్చు.