మనం చేస్తున్న ఈ సుపరిపాలన వద్దని… మా బాబు పాలనే కాలవాలని దుష్టచతుష్టయం అంటుందని… బాబు, రామోజీ రావు, ఏబీఎన్, టీవీ5 లతో పాటు ఓ దత్త పుత్రులు కలిసి ప్రభుత్వంపై దుష్ఫ్రచారం చేస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు. మరో శ్రీలంకగా రాష్ట్రం మారుతుందని విష ప్రచారం చేస్తున్నారంటూ విమర్శించారు. పేదరికంలో ఉండీ అలమటిస్తున్న వారికి ఇలా పథకాాలు అమలు చేయడానికి వీలు లేదని ఈ దుష్టచతుష్టయం అంటుందని విమర్శించారు. టీడీపీ ఏం చెప్పదల్చుకుందో… ఈనాడు పేపర్లో చెబుతున్నారని ఎద్దేవా చేశారు. పేదవర్గాలకు అందుతున్న లబ్ధిని పథకాలను ఆపేయాలంటూ ఎల్లో పార్టీ, ఎల్లో మీడియా తెగ ప్రయత్నాలు చేస్తున్నాయని జగన్ విమర్శించారు. పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం ఫైర్ అయ్యారు. పేదలకు ఇవ్వకుంటే శ్రీలంక అవుతుందని… డబ్బులు నేతల జేబుల్లోకి వెళితే అమెరికా అవుతుందా…?అని ప్రశ్నించారు. ఇలాంటి దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నా అని జగన్ అన్నారు.
దుష్ట చతుష్టయం… దత్తపుత్రుడుతో యుద్ధం చేస్తున్నా: సీఎం జగన్
-