బాబు మాటకే కాదు… థాట్ కి కూడా చెక్ పెడుతోన్న జగన్

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్ జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. అదేమంటే.. పెన్షన్ దారులకు ప్రస్తుతం అందిస్తున్న రూ.2,250 పింఛన్ ను 2,500 కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మ‌హిళ‌ల‌కు ఈ పింఛన్ ను గ్రామ వాలంటీర్ ల ద్వారా అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే పెంచిన పెన్షన్ ను ఆగస్ట్ 1 నుంచి అమలు చేయనున్నట్లు తెలిపింది.

అయితే ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి రాకముందు పింఛన్లను పెంచుతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాటను నిలబెట్టుకుని పింఛన్ ను రూ.2,250 అందిస్తున్నామని చెప్పి తొలి సంతకం చేశారు. ఇప్పుడు దానికి మరో రూ.250 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే… ఈ నెల 15వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై ప్రతిపాదనలను రెడీ చేయాలని సంబంధిత అధికారుల‌కు సీఎస్ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇక ఏపీలో ఎలాంటి సమస్యలను గురించి ప్రతిపక్షాలు ముఖ్యంగా బాబు మాట్లాడేందుకు కాదు..కాదు.. అలాంటి వాటిని గురించి ఆలోచించేందుకు అవకాశం ఇవ్వకుండా జగన్ చెక్ పెడుతున్నారు.

అంతేకాకుండా తాజాగా దేశంలో అత్యధికంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది. కరోనా పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలిన వ్యక్తులను కరోనా తీవ్రతను బట్టి హోమ్ క్వారంటైన్ లేదా, ఆసుపత్రులకు తరలిస్తున్నారు. హోమ్ క్వారంటైన్ లో ఉండే వ్యక్తులు తమకు కావాల్సిన మెడిసిన్స్, శానిటైజర్లు వంటి వాటికోసం బయటకు వెళ్లాల్సి వచ్చేది. అయితే దీని వలన వీరి నుంచి మరికొంతమందికి కరోనా సోకే అవకాశం ఉంటుంది. అందుకే ఏపీ ప్రభుత్వం మరో కొత్త నిర్ణయం తీసుకుంది. హోమ్ క్వారంటైన్ లో ఉండే వారి కోసం ప్రత్యేకంగా హోమ్ క్వారంటైన్ కిట్స్ ను తయారు చేసింది. వీటిని హోమ్ క్వారంటైన్ లో ఉండే వారికి అందించనుంది.

అలాగే… ఈ కిట్ లో కరోనా మెడిసిన్స్, శానిటైజర్, మాస్క్ లు, గ్లౌజ్ లు, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు ఉపయోగపడే ఆక్సిమీటర్ లు కూడా ఉంటాయి. కాగా కరోనా తీవ్రత తక్కువగా ఉండి హోమ్ క్వారంటైన్ లో ఉండే వారికి ఈ కిట్లు అందజేయనింది ప్రభుత్వం. కాగా కరోనా తీవ్రత పెరిగితే తప్పనిసరిగా హాస్పిటల్ కు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో అస్సలు కరోనా విషయంలో కూడా ప్రతిపక్షాలను మాట్లాడనివ్వకుండా చేస్తుంది వైఎస్ జగన్ సర్కార్. మొత్తానికి జగన్ చర్యలు ఏకంగా ప్రతిపక్షాలకు ఇష్యూలపై థాట్ నే రానివ్వకుండా చేసేలా ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.