జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వచ్చిన ఉద్యోగులకు ఉచిత వసతి సదుపాయాన్ని మరోమారు పొడిగిస్తూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఉద్యోగులకు ఉచిత వసతి సదుపాయాన్ని 2023 జూన్ 26 తేదీ వరకూ పొడిగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఏపీ సచివాలయం, శాసనసభ, హెచ్ఓడీలు, హైకోర్టు, రాజ్ భవన్ ఉద్యోగులకు ఈ ఉచిత వసతి వెసులు బాటును పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు, విజయవాడ నగరాల్లో బస చేస్తున్న ఉద్యోగులకు ఉచిత వసతి సదుపాయాన్ని 2024 వరకూ పొడిగించాల్సిందిగా ఉద్యోగ సంఘాలు కోరాయి. ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.