3 రాజధానుల పేరుతో జగన్ ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ సవాల్ విసిరింది. నిన్న టీడీఎల్పీ భేటీ జరిగింది. రాజధాని విషయంలో అసెంబ్లీ రద్దు చేస్తారా అనే సవాల్ విసరాలని ఈ సందర్భంగా టీడీఎల్పీ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ… రాజధాని విషయంలో జగన్ మాట తప్పారు… మూడు రాజధానుల అంశాన్ని రెఫరెండంగా తీసుకుని జగన్ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.
మూడు ముక్కల రాజధానిపై జగనుకు నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేయాలి… ఇదే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వానికి సవాల్ విసరబోతున్నామన్నారు. సభ సజావుగా జరగకూడదని ప్రభుత్వ ఆలోచన చేస్తుందని.. ప్రభుత్వ మూడున్నరేళ్ల వైెపల్యాలను ఎండగడతామని హెచ్చరించారు.
ఏపీలో యువత నిర్వీర్యం అయింది.. నిరుద్యోగం పెరిగింది.. జగన్ పాలనలో ప్రజలను పన్నులతో బాదేస్తున్నారని ఆగ్రహించారు. వైసీపీ ప్రభుత్వంలో వరి వేసుకుంటే ఉరే అనే పరిస్థితుల్లోకి రైతులు వెళ్లారు… ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. వైసీపీ నేతల ఇసుక, మద్యం దొపిడీకి అడ్డే లేకుండా పోయింది… ప్రభుత్వ వైఫల్యాలను సమావేశాల్లో ఎండగడతామని హెచ్చరించారు నిమ్మల రామానాయుడు.