భద్రతా బలగాలకు సంబంధించి ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు

Join Our Community
follow manalokam on social media

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది..ఇక మీదట భద్రతా బలగాలకు సంబంధించి గ్యాలంట్రీ అవార్డులు పొందిన వారికి ఇచ్చే ఆర్థిక సాయం పెంపుదల చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేశారు..పరమవీరచక్ర, అశోక చక్ర లాంటి అవార్డులు పొందిన వారికి ఇప్పటి వరకు 10 లక్షలు సహాయం చేస్తూ ఉండగా దానిని కోటి రూపాయలకు పెంచారు.

అలాగే మహావీర్ చక్ర, కీర్తి చక్ర అవార్డ్ పొందిన వారికి ఇప్పటి దాకా ఎనిమిది లక్షలు సాయం అందిస్తుండగా దాన్ని 80 లక్షలకు పెంచారు. అలాగే వీర్ చక్ర, సౌర్య చక్ర పొందిన వారికి ఇప్పటిదాకా 6 లక్షల సాయం అందిస్తుండగా ఇక నుంచి 60 లక్షలు సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు . అయితే ఈ అవార్డులు ఏపీకి చెందిన వారికి వస్తే మాత్రమే ఆర్థిక సాయం అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది.

TOP STORIES

ఈ నీలి రంగు గెలాక్సీ ఎంత అందంగా ఉంది : నాసా

గెలాక్సీలో ఎంతో వింతలు చోటు చేసుకుంటాయి. వాటిని చూడాలని అందరూ ఎంతో ఆతురతగా ఎదురు చూస్తుంటారు. ఇటీవల అంగారక గ్రహంపై అడుగు పెట్టిన నాసా.. ల్యాండింగ్...