AP Grama Sachivalayam : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కేంద్ర సర్కార్. నిన్న పోలవరం కోసం… నిధులు విడుదల చేసిన కేంద్రం తాజాగా స్థానిక సంస్థల కోసం కూడా నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఇందులో భాగంగానే ఏపీలోని స్థానిక సంస్థలకు 287 కోట్లు విడుదల చేసింది 15 ఆర్థిక సంఘం. ఈ నిధులను.. స్థానిక సంస్థలకు వాడుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాలన పరమైన ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు గ్రామ పంచాయతీలు, మండల అలాగే జిల్లా పరిషత్లకు నిధులను కేటాయించింది పంచాయతీరాజ్ శాఖ. అలాగే పిఎం జన్మన్ పథకం కింద 332 గిరిజన గ్రామాల్లో మంచినీరు అందించేందుకుగాను… 29.93 కోట్లు నిధులు విడుదల చేశారు.
అటు పోలవరం ప్రాజెక్టుకు ఏకంగా 2800 కోట్లు విడుదల చేసింది కేంద్ర సర్కార్. నిన్న చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిన తర్వాత… ఈ ప్రకటన రావడంతో ఆయన కృషి వల్లే పోలవరం నిధులు విడుదలయ్యాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. పోలవరం రియంబర్స్మెంట్ కింద 800 కోట్లు అలాగే అడ్వాన్స్గా 2000 కోట్లు ఇచ్చినట్లు సమాచారం అందుతోంది.