ఏపీ డీజీపీకి హైకోర్టు వార్నింగ్.. అలా ఐతే రాజీనామా చేయాలి..!

-

ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ పనితీరుపై రాష్ట్ర హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలీస్ వ్యవస్థ గనుక తమ తీరు మార్చుకోకపోతే.. నైతిక బాధ్యత వహిస్తూ.. డీజీపీ రాజీనామా చేయాలని తెగేసి చెప్పింది. ఇటీవల అమలాపురం మండలం ఇందుపల్లిలో వెంకటరాజు అనే వ్యక్తి అదృశ్యం అయ్యాడు. దీంతో ఆ బాధితుడి మేనమామ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. కాగా, ఈ కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలియడంతో.. పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే గతంలో కూడా మూడు సార్లు జ్యుడీషియల్ విచారణ చేస్తే పోలీసులదే తప్పని తేలిందంటూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అదేవిధంగా ఏపీలో పోలీస్ వ్యవస్థ గాడితప్పుతోందన్న హైకోర్టు ఏపీలో రూల్ ఆఫ్ లా అమలు కావడం లేదని మండిపడింది.

అలాగే పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ రాజీనామా చేయాల్సిఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో డీజీపీని పలు సార్లు కోర్టుకు పిలిపించిన వ్యవస్థలో మార్పు రాలేదని చెప్పింది కోర్టు. ప్రతిసారి ఇలాంటి పరిస్థితే వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని హైకోర్టు ఈ సందర్భంగా హెచ్చరించింది. అలాగే ప్రతి కేసులో సీబీఐ విచారణ సాధ్యం కాదని హైకోర్టు తేల్చిచెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news