ఏపీ లో పది ఫలితాలు ఎఫెక్ట్ ఇంక వదల్లేదు..అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు..సిలబస్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎక్కువ మంది ఫెయిల్ అవ్వడంతో అధికారులు ఇంటర్ రిజల్ట్స్ పై ఫోకస్ పెట్టారు.. గత కొన్ని రోజులుగా ఇంటర్ ఫలితాల పై టెన్షన్ నెలకొంటుంది..విద్యార్థులు, తల్లి దండ్రులతో పాటు, అధికారులకు కూడా టెన్షన్ పట్టుకుంది..ఈ రిజల్ట్స్ పై ఎన్నో అఫొహలు వచ్చాయి.మొత్తానికి అన్ని అడ్డంకులు దాటుకొని ఈరోజు విడుదలకానున్నాయి.
మంత్రి బొత్స సత్యనారాయణ నేడు మధ్యాహ్నం 12.30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ విషయం పై అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. విజయవాడ ఫార్ట్యూన్ మురళి లో మధ్యహ్నం12:30 కు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను https://bie.ap.gov.in/ వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు..