పెట్టుబడుల కేంద్రంగా ఏపీ..ఇండియాలోనే నంబర్‌. 1

ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత… తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోగా.. ఆంధ్ర ప్రదేశ్‌ మాత్రం… అభివృద్ధిలో కుంటుపడింది. అయితే.. ఏపీలో వైసీపీ పార్టీ అధికారంలోకి రాగానే.. ఏపీ మళ్లీ ఫామ్‌ లోకి వచ్చింది. అభివృద్ధి పరంగా.. పెట్టుబడుల పరంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే.. ఇండియాకే పారిశ్రామిక పెట్టుబడుల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.

2022 సంవత్సరానికి పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ టాప్ లో నిలిచింది. ఈ ఏడాది మొదటి 7 నెలల్లోనే రూ. 40,361 కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. 2022లో దేశంలోని మొత్తం పెట్టుబడుల్లో 45 శాతం పెట్టుబడులను ఆకర్షించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ, ఒడిశా నిలిచాయి. జూలై 2022 నుంచి నేటి వరకు ఏపీకి వచ్చిన పెట్టుబడుల వివరాలను డీపీఐఐటీ నివేదిక వెల్లడించింది.

డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) నివేదిక ప్రకారం ₹1,71,285 కోట్ల భారతదేశ పారిశ్రామిక పెట్టుబడిలో ఆంధ్రప్రదేశ్ రూ. 40,361 కోట్లు ఆకర్షించి అగ్రస్థానంలో నిలవగా ఒడిశా రూ.36, 828 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఏపీ క్యాబినెట్ ఇప్పటికే ఇతర రంగాల్లో ఎస్ఐపీబీ ద్వారా రాష్ట్రానికి వచ్చిన రూ.1,26,748 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలను ఆమోదించింది. ఈ పెట్టుబడులతో 40,330 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించునుంది.