కలకలం… కుప్పంలో చంద్రబాబు పీఏపై కేసు నమోదు

-

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు టార్గెట్ గా పెద్ద ఎత్తున దర్యాప్తులతో పాటు కేసులు కూడా నమోదైపోతున్న వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటికే చంద్రబాబుకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాస్ ఇంటిలో ఆదాయపన్ను శాఖ సోదాలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబుకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న మనోహర్ పై ఏకంగా కేసే నమోదైపోయింది. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోనే తాజాగా మనోహర్ పై పోలీసులు కేసు నమోదు చేసేశారు.

ఈ కేసు పూర్వపరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంకు కింద కుప్పంలో ఓ శాఖ ఉంది. కుప్పం టౌన్ బ్యాంకుగా ప్రసిద్ధి చెందిన ఈ బ్యాంకులో పెద్ద ఎత్తున ఆర్థిక కార్యకలాపాలు ఇతర బ్యాంకుల మాదిరే సాధారణంగానే ఉన్నా… ఈ బ్యాంకు చైర్మన్ కోసం జరిగే ఎన్నికలు జిల్లాలోనే ఆసక్తి రేపుతుంటాయి. ఏళ్ల తరబడి చంద్రబాబు కుప్పం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో కుప్పంలో ఏం జరిగినా కూడా చంద్రబాబు సెంట్రిక్ గానే అంతా చూస్తున్న వైనం తెలిసిందే. ఈ క్రమంలో ఈ బ్యాంకులో గంగమ్మ ఆలయ కమిటీ పేరిట ఉన్న ఓ ఖాతా నుంచి ఫోర్జరీ సంతకంతో మనోహర్ రూ.1 లక్ష డ్రా చేశారట.

దీనిపై గంగమ్మ ఆలయ కమిటీ చైర్మన్ గా ఉన్న వైసీపీ నేత విద్యా సాగర్.. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి మనోహర్ రూ.1 లక్ష డ్రా చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కుప్పం పోలీసులు మనోహర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో ఏం తేలుతుందో తెలియదు గానీ… చంద్రబాబు పీఏపై, అది కూడా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనే పోలీసు కేసు నమోదైందన్న విషయం ఇప్పుడు నిజంగానే హాట్ టాపిక్ గా మారిపోయింది. అంతేకాకుండా ఈ బ్యాంకులో ఇంకా చాలా అక్రమాలు చోటుచేసుకున్నాయన్న వార్తలు కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news