విశాఖలోని ఆస్తుల కబ్జాలో భాగంగానే నేడు గీతంపై పడ్డారు – అచ్చెన్నాయుడు

-

కక్షలు కార్పణ్యాలు తప్ప.. జగన్ రెడ్డి పాలనలో సాధించిందేంటి? రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ‘‘గీతం’’పై రాద్దాంతం చేస్తున్నారని ఆగ్రహించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్న. విశాఖలోని ఆస్తుల కబ్జాలో భాగంగానే నేడు గీతంపై పడ్డారని.. ఆక్రమణల ఆరోపణలతో సరస్వతీ నిలయాలపై ఫక్తు రాజకీయాలు అని మండిపడ్డారు. జగన్ రెడ్డి ఫ్రస్టేషన్ కు నేటి గీతం ఆస్తుల విధ్వంసమే నిదర్శనమని.. దిక్కుతోచని స్థితిలో ప్రతిపక్షాలు, వారి సంస్థలపై దాడులు చేస్తున్నారని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు.

గీతం యూనివర్శిటీపై ఆరోపణలు రాజకీయ కక్షేనని.. నిజంగా ఆక్రమణలుంటే నోటీసులెందుకు ఇవ్వలేదు?అని ఆగ్రహించారు. రాజధాని పేరుతో ప్రశాంత విశాఖను ఫ్యాక్షన్ కేంద్రంగా మార్చారని.. భూ కబ్జాలు, ఆక్రమణలు, సెటిల్ మెంట్లకు కేంద్రంగా తయారు చేశారని ఫైర్‌ అయ్యారు. జీవో నెం.1 పేరుతో ప్రజాస్వామ్య స్ఫూర్తికి జగన్ రెడ్డి తూట్లు పొడుస్తున్నారని… చంద్రబాబు సభలను అడ్డుకుంటూ వైసీపీ సభలు, ర్యాలీలకు రెడ్ కార్పెట్ వేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్న.
దీనిపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత మొదలైంది… ఈ అరాచకాల నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసమే గీతం వర్శిటీపై పడ్డారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news