బాబు కళ్యాణ్.. ఏపీలో 26 జిల్లాలు ఉన్నాయి.. 25 కాదు – గుడివాడ అమర్నాథ్ కౌంటర్

-

ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసిపి మంత్రి గుడివాడ అమర్నాథ్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్ ఓ ట్వీట్ చేస్తూ.. అమెరికాలోని మౌంట్ రష్ మోర్ చిత్రాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అది ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ – విశ్వాసాలకి చిహ్నంగా పేర్కొన్నారు. మరో ట్వీట్ లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రగా పేర్కొంటూ.. 25 జిల్లాలను రాష్ట్రాలుగా ప్రకటించి 25 రాజధానులకు వెళ్ళండని ఎద్దేవా చేశారు.

ఏపీని వైకాపా రాజ్యాంగా మార్చుకోండని దుయ్యబట్టారు. సర్వతోముఖాభివృద్దికి మంత్రం వికేంద్రీకరణ అనుకుంటే 3 రాజధానులే ఎందుకని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ ట్వీట్ కి మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. “బాబు కళ్యాణ్.. ఏపీలో 26 జిల్లాలు ఉన్నాయి. 25 కాదు. ఇష్టం వచ్చిన “ఫిగర్లు” వద్దు బాబు!” అంటూ సెటైర్ వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news