ఏపీ యువత చెవుల్లో రీసౌండ్ తెప్పించేసే మాట చెప్పిన బాబు!

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. “రాష్ట్రంలో వేధింపుల క్యాలెండర్‌ ఒక్కటి మాత్రమే అమలు అవుతోంది.. ఉద్యోగాల క్యాలెండర్‌ ఎక్కడా కనిపించడం లేదు” అంటూ నిరుద్యోగుల విషయంలో తనదైన కన్నీరు కారుస్తున్నారు! “ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవం” సందర్భంగా తాజాగా ఆయన యువతకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గత వైభవం గురించి స్పందించారు బాబు!

ఇదే సమయంలో యువతకు ఉపాధి కల్పనలో రాష్ట్రాన్ని దేశంలోనే మూడో స్థానానికి తీసుకురావడానికి టీడీపీ హయాంలో చేసిన కృషి ప్రశంసనీయమని మొదలుపెట్టిన బాబు… గత ప్రభుత్వంలో ఐదు లక్షల మందికి నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇచ్చామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి అంతా నాశనం చేసిందని.. తన ప్లాన్ అంతా పాడు చేసిందని దుయ్యబట్టారు.

సరే బాబు చెప్పిన ఆ సంగతులు అలా ఉంటే… అసలు చంద్రబాబు చెప్పినట్లుగా గతంలోని ఆయన ప్రభుత్వంలో రూ.రెండు వేల నిరుధ్యోగ భృతి ఎవరికి ఇచ్చారో బాబే చెప్పాలి!! ఎన్నికల హామీలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుధ్యోగ భృతి అమలు చేయకుండా… మళ్లీ ఎన్నికలు వచ్చిన చివరికాలంలో అంటే 2018 అక్టోబర్ నుంచి వెయ్యి రూపాయలను కొంతమంది తమ్ముళ్లకి మాత్రమే ఇచ్చిన బాబుకు.. తర్వాతి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని అదే యువత రుచి చూపించిన సంగతి తెలిసిందే.

మొత్తానికి చరిత్ర సత్యం చెప్తుంది. బాధ్యతగల 40 ఇయర్స్ ఇండస్ట్రీ ట్విట్టర్ ద్వారా అసత్యపూరితమైన అభిప్రాయాలు చేస్తుంటే… లోకం ప్చ్ అంటుంది. 2019 ఎన్నికల ఫలితాల అనంతరం అంతా ఆ దారుణ గతాన్ని మరిచిపోయి ప్రశాంతంగా బ్రతుకుతున్న సమయంలో.. కరోనా కష్టకాలంలో ఇలాంటి దారుణ గతాన్ని గుర్తుచేసిన బాబు మరింత దారుణాలను పాల్పడుతున్నారని అంటున్నారు ఏపీ వాసులు! ఇవన్నీ ఒకెత్తు అయితే… బాబు తాజాగా చెబుతున్న… “ఐదు లక్షల మందికి నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇచ్చాము” అన్న ఒక్క మాట మాత్రం “ఏపీ యువత – నాటి నిరుద్యోగుల” చెవుల్లో నేడు రీసౌండ్ తెప్పించేస్తుందంటున్నారు!!