కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి 8 గంటల సమయంలో అమిత్ షా నివాసంలో భేటీ అయిన విషయం తెలిసిందే. సుమారు 40 నిమిషాలకు పైగా ఈ ముగ్గురి మధ్య భేటీ సాగింది. వచ్చే ఎన్నికలలో టిడిపి, జనసేన, బిజెపి కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.
అయితే తాజాగా చంద్రబాబుపై పరోక్షంగా విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు ప్రముఖ సినీనటుడు, నిర్మాత బండ్ల గణేష్. ” కర్మ కాకపోతే ఇంకేంటి. ఆయన సిపిఎం అంటే సిపిఎం అనాలి, ఆయన బిజెపి అంటే బిజెపి అనాలి, కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అనాలి, జనసేన అంటే జనసేన అనాలి.. ఆయన ఏ పేరు చెబితే దాన్ని అందరూ ఫాలో అవ్వాలి. అంతేగాని ఎవరికి ఆత్మ అభిమానం, మంచి చెడు, మానవత్వం ఉండదు. ఆయనని పొగిడితే జాతిని పొగిడినట్టు.. లేకపోతే జాతికి ద్రోహం చేసినట్టు. ఇంతకంటే ఏం కావాలి దరిద్రం” అని పరోక్షంగా సంచలన ట్వీట్ చేశారు బండ్ల గణేష్.
కర్మ కర్మ కాకపోతే ఇంకేంటి ఆయన సిపిఎం అంటే సిపిఎం అనాలి బిజెపి అంటే బిజెపి అనాలి కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అనాలి.జనసేన అంటే జనసేన అనాలి ఆయన కన్వీనెంట్గా ఏ పేరు చెప్తే దాన్ని అందరు ఫాలో అవ్వాలి అంతేగాని ఎవరికి ఆత్మవిమానం మంచి చెడు మానవత్వం… https://t.co/gNAei7TQxs
— BANDLA GANESH. (@ganeshbandla) June 4, 2023