సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు హుజురాబాద్ ఎమ్మెల్యే, బిజెపి నేత ఈటెల రాజేందర్. నేడు యాదాద్రి జిల్లాలో ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ గడ్డమీది నుండి కెసిఆర్ ని తరిమికొట్టే రోజు త్వరలోనే వస్తుందన్నారు.
తెలంగాణ ప్రజల సొమ్ముతో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారని.. తెలంగాణలో రైతు వేదికలు ఎందుకు పనికిరాకుండా పోయాయన్నారు. రైతు ప్రభుత్వంగా చెప్పుకునే బిఆర్ఎస్ పార్టీ రైతులకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. రింగ్ రోడ్డుల నిర్మాణం పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవతారం ఎత్తిందని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల అండదండలతో రాబోయే ఎన్నికలలో బిజెపి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈటెల రాజేందర్.