ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి – భానుప్రకాశ్ రెడ్డి

-

ఏపీ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ ను కోరుకుంటున్నారని.. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ తెవడానికే తాము ప్రయత్నిస్తున్నట్లు బిజెపి నేత భానుప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. అగ్నిపథ్ ను అర్ధం చేసుకోకుండా విమర్శిస్తున్నారని.. రేవంత్ అవగాహన రహితంగా మాట్లాడుతున్నారని ఓ రేంజ్ లో ఫైర్‌ అయ్యారు.

బెయిల్ పై భయట ఉన్న రేవంత్ దేశ భద్రత గురించి మాట్లాడుతున్నారని… రేవంత్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్ కు కేరాఫ్ అడ్రస్ లేదు… సంక్షేమ పథకాలకు బిజెపి వ్యతిరేకం కాదన్నారు. సంక్షేమ పథకాలతో సంక్షోభం లో పడొద్దని.. జగన్మోహన్ రెడ్డికి కౌంట్ డౌన్ మొదలయిందని ఎద్దేవా చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను జగన్మోహన్ రెడ్డి గుర్తు తెచ్చుకోవాలని హెచ్చరించారు బిజెపి నేత భానుప్రకాశ్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news