భూమా అఖిలప్రియ భర్తకు బెయిల్ మంజూరు

-

ఏవి సుబ్బారెడ్డి పై దాడి కేసులో టిడిపి నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కి ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్ బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నంద్యాలకు చేరుకున్న సందర్భంగా మరో టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డి పై దాడి చేసిన కేసులో అఖిల ప్రియ, భార్గవ్ రామ్ ని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరికీ 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు.

ఈ దాడి కేసులో ఇప్పటికే అఖిలప్రియ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆమె భర్త భార్గవ్ రామ్ కి మిగిలిన నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు కోర్ట్ నిరాకరించింది. కాగా ఇప్పుడు భార్గవ్ రామ్ కి ఊరట లభించింది. భార్గవ్ రామ్ బెయిల్ పై హైకోర్టు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version