ఏపీ ముస్లింలకు బిగ్ షాక్. ముస్లింలకు జగన్ సర్కార్ మొండి చెయ్యి రాష్ట్రంలో 8.8% జనాభా ఉన్న ముస్లిం మైనార్టీలకు వైకాపా ప్రభుత్వం దోకా ఇచ్చింది. రంజాన్ తోఫా వంటి పథకాల అమలును ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక జగన్ నిలిపివేయడంతో పాటు ఎన్నికల ముందు చేపట్టిన పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా చెప్పిన పలు వాగ్దానాలను పక్కన పెట్టారు.
అందరికీ వర్తించే నవరత్న పథకాలనే ముస్లింల ఖాతాల్లో వేస్తూ కాలం వెల్లదీస్తున్నారు. వారికంటూ ప్రత్యేకంగా అందించిన సాయం ఏదీ లేదు. గతంలో ముస్లిం యువతకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ. లక్ష వరకు రాయితీ రుణాలు ఇవ్వగా ఇప్పుడు ఆ ఊసే లేదు. మైనారిటీ ఆర్థిక సంస్థను నిధుల మళ్లింపునకు మాత్రమే పరిమితం చేశారు. వైయస్సార్ షాదీ తోఫా, విదేశీ విద్యా దీవెన పథకాల్లో నిబంధనలు సడలించాలని పలు ముస్లిం సంఘాలు విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడం లేదు.