పాపం..! రాజు గారి కష్టాన్ని గుర్తించని బీజేపీ  పట్టించుకోని వైసీపీ ?

-

నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం రెండిటికి చెడ్డ రేవడిలా మారినట్లు కనిపిస్తోంది. ఆయన గత కొంత కాలంగా వైసీపీ ప్రభుత్వం పై అనేక విమర్శలు చేస్తూ, పార్టీలోని కొంతమంది నాయకులను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తూ, పదేపదే కవ్వింపు చర్యలకు దిగుతూ వస్తున్నారు. రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా దానికి స్పందిస్తూ, వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. మొదట్లో రఘురామకృష్ణంరాజు వ్యవహారాన్ని వైసిపి సీరియస్ గా తీసుకుని ఢిల్లీకి వైసీపీ ఎంపీలు ప్రత్యేక విమానంలో వెళ్లి లోక్ సభ స్పీకర్క ఫిర్యాదు సైతం చేశారు. ఆయనపై అనర్హత వేటు వేయాల్సిందిగా కోరారు. ఈ వ్యవహారం తో రఘు రామ కృష్ణంరాజు మరింతగా ఏపీ ప్రభుత్వం పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు.
ఆయన బీజేపీలోకి వెళ్లేందుకు ఈ విధంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయనపై అనర్హత వేటు వేస్తే బిజెపిలో చేరవచ్చని రాజు గారు ప్లాన్ అని గ్రహించిన వైసిపి ఆయన వ్యవహారాన్ని పట్టించుకోవడం మానేసింది. అంతేకాదు పార్టీ నాయకులు ఎవరు రఘురామకృష్ణంరాజు విమర్శలకు స్పందించ వద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇక రఘురామకృష్ణంరాజు విమర్శలపై టిడిపి, బిజెపి స్పందించి ఏపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ, వచ్చేవి. రఘురామకృష్ణంరాజు తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారంలో అనేక విమర్శలు చేయడంతో బిజెపి సైతం ఆయన వ్యాఖ్యలకు మద్దతు పలికి వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ వచ్చింది. తరువాత ఓ సందర్భంలో బీజేపీకి సైతం రఘురామకృష్ణంరాజు చురకలు అంటించడం తో ఆయనపై ఫైర్ అయిన బీజేపీ నాయకులు అప్పటి నుంచి ఆయన పూర్తిగా పక్కన పెట్టేశారు.
ఇప్పుడు రాజుగారి వ్యవహారం చూస్తుంటే , బిజెపిలోకి రఘురామ కృష్ణంరాజు ఎంట్రీ ఉంటుందా లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. వాస్తవంగా వైసిపి ప్రభుత్వ హవాను తగ్గించేందుకు రఘురామకృష్ణరాజు ప్రయత్నిస్తూ, పరోక్షంగా బీజేపీకి మేలు చేసే విధంగా వ్యవహరిస్తున్నా, బీజేపీ మాత్రం రఘురామకృష్ణంరాజును ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆయన చాలా కాలంగా ఢిల్లీలోనే మకాం వేసి, బిజెపి అగ్ర నేతలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీకి వచ్చేందుకు ఆయన ధైర్యం చేయలేకపోతున్నారు. ప్రస్తుతం వ్యవహారం చూస్తుంటే అటు బీజేపీ కూడా రాజు గారిని పక్కన పెట్టేసినట్టు గా కనిపించడంతో, అటు బిజెపిలోకి వెళ్లలేక, తిరిగి వైసీపీతో సన్నిహితంగా ఉండలేక రాజుగారు రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
-Surya

Read more RELATED
Recommended to you

Latest news