ఏపీ హైకోర్టు… క‌ర్నూల్‌కు త‌ర‌లించడంపై కేంద్రం కీలక ప్రకటన

-

ఏపీ హైకోర్టు.. క‌ర్నూల్‌కు త‌ర‌లించడంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పార్లమెంట్ లో ఇవాళ ఏపీ హై కోర్టు తరలింపుపై ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు కీలక ప్రకటన చేశారు. ఏపీ హైకోర్టును అమ‌రావ‌తి నుంచి క‌ర్నూల్‌కు త‌ర‌లించాల‌నే ప్ర‌తిపాద‌న కేంద్రానికి అందిందన్నారు కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు.

- Advertisement -

క‌ర్నూల్‌కు త‌ర‌లింపుపై హైకోర్టుతో సంప్ర‌దింపులు జ‌రిపి రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే నిర్ణ‌యం తీసుకోవాలి.. హైకోర్టు నిర్వ‌హ‌ణ ఖ‌ర్చుల‌న్నీ రాష్గ్ర ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుందని పేర్కొన్నారు. హైకోర్టును క‌ర్నూల్‌కు త‌ర‌లింపుపై రాష్ట్ర ప్ర‌భుత్వం, హైకోర్టు క‌లిసి ఒక నిర్ణ‌యానికి రావాల్సి ఉంది.. ఆ త‌ర్వాత ఆ ప్ర‌తిపాద‌న‌లు కేంద్రానికి పంపాల్సి ఉంటుందని చెప్పారు. క‌ర్నూల్‌కు హైకోర్టు త‌ర‌లింపుపై వైఎస్సార్సిపి ఎంపీలు కోట‌గిరి శ్రీధ‌ర్‌, చింతా అనురాధా అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు స‌మాధానం ఇచ్చారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...