ఏపీకి కేంద్రం శుభవార్త.. ఆ నిధులు విడుదల

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం తీపి కబురు అందించింది. రాష్ట్రానికి రూ. 948.35 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. ఈ నిధులను పంచాయితీల అభివృద్ధికి ఖర్చు చేయనున్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుతో గ్రామాల్లో తాగునీరు సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర అభివృద్ధి పనులు మౌలిక వసతుల కల్పన కోసం ఈ నిధులను వెచ్చించనున్నారు.

 

అలాగే బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కాకినాడ, గోదావరి జిల్లాలోని కేపీ పురంలో ఈ పార్కు ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు బల్క్ డ్రగ్ పార్క్ కు ఆమోదం తెలుపుతూ కేంద్రం ఏపీకి లేఖ రాసింది. బల్క్ డ్రగ్ పార్క్ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, కర్ణాటక సైతం పోటీ పడగా ఏపీకి ఆ అవకాశం దక్కింది.

ఈ మేరకు సి.ఎస్ సమీర్ శర్మకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సంయుక్త కార్యదర్శి ఎన్.యువరాజు మంగళవారం లేఖ రాశారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం కొత్త పెరుమల్లపురం, కోదాడ గ్రామాల పరిధిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు ఇచ్చింది.ఈ ప్రతిపాదనకు స్టీరింగ్ కమిటీ ఆమోదం తెలిపిందని లేఖలో ప్రస్తావించారు

Read more RELATED
Recommended to you

Latest news