చంద్రబాబుకి కొడుకు మీద నమ్మకం లేక అద్దె కొడుకుని తెచ్చుకున్నారు – ఎంపీ భరత్

-

టిడిపి అధినేత నారా చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేశారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. గతంలో తెలుగుదేశం జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను దోచుకుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు సుపుత్రుడు లోకేష్ వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయమని వాళ్ళకి వాళ్ళు ఒప్పుకుంటున్నారని అన్నారు. 2019లో జగనన్న జన ప్రభంజనం ఎలా జరిగిందో 2024 లో అదే జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

చంద్రబాబుకి కొడుకు మీద నమ్మకం లేక పేమెంట్లు ఇచ్చి అద్దె కొడుకుని తెచ్చుకున్నాడని ఆరోపించారు. మాట్లాడ్డం చేతకాని నారా లోకేష్ పప్పు ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే ఎవరైనా నమ్ముతారా..? అని ఎద్దేవా చేశారు. సీనియర్ ఎన్టీఆర్ కి చంద్రబాబు అన్యాయం చేశారని.. శత జయంతి ఉత్సవాలకి రజనీకాంత్ రావడం ఆయన ఆలోచించాలన్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఒక గౌరవం ఒక ఇమేజ్ ఉందని… దయచేసి చంద్రబాబును నమ్మొద్దని సూచించారు. బిజెపి జార్జ్ సీట్ల పేరుతో కొత్త కొత్త డ్రామాలకు తెర తీసిందన్నారు ఎంపీ భరత్. గతంలో మట్టి తవ్వి తెలుగుదేశం నాయకుల జేబులు నింపుకుంటే.. ఇప్పుడు మట్టి తవ్వితే ప్రభుత్వ ఖజానాకు వెళుతుందని… దీన్ని ప్రజల గమనించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news