తాడేపల్లి ఫైల్స్ అనే పేరుతో సినిమా తీస్తే..5-6 సీక్వెల్స్ తీయాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు సోమిరెడ్డి. జగన్ను పొగడడానికి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ తప్ప మరేం లేదు. చంద్రబాబు గొప్పతనాన్ని తలైవా రజనీకాంత్ పొగిడారని వెల్లడించారు. ఏపీలో మైనింగ్ చట్టం జగన్ పాదాల కింద నలిగిపోతుందని.. జగనాసుర రక్తచరిత్ర ఏపీలో ఉందన్నారు.
సొంత తల్లి చెల్లి వదిలి పెట్టేసి వెళ్లారని.. ఏపీలో జగన్ సీఎం అయ్యాక మాపై ఎన్ని కేసులు బుక్ చేశారు..అని ఆగ్రహించారు. మీకు నచ్చని విధంగా ఎవరైనా ఏమైనా చేస్తే చంపేస్తున్నారని.. డ్రైవర్ సుబ్రమణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు చంపేశారని ఆరోపణలు చేశారు. తాతయ్య హత్య, బాబాయ్ హత్య, ఓ బాబాయ్ జైలుకెళ్లారు.. మరో తమ్ముడు జైలుకెళ్లబోతున్నారు… స్థానిక సంస్థలకు నిధులివ్వడం లేదని ఆగ్రహించారు. ఫైనాన్స్ కమిషన్ నిధులు మళ్లించేస్తున్నారు…ఏపీలో ఇంత దారుణంగా ఉంటే కేంద్రం ఏం చేస్తుందన్నారు. ఇప్పటికే 108 నియోజకవర్గాల్లో జగన్ కు చుక్కలు చూపించారు… ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయని ప్రకటించారు సోమిరెడ్డి.