ప్రస్తుతం టీడీపీ నేతలకు, కార్యకర్తలకు మామూలు బ్యాడ్ టైం నడవడంలేదనే చెప్పుకోవాలి! 2019సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం మొదలైన ఈ బ్యాడ్ టైం రూపాలు మార్చుకుంటూ రోజు రోజుకీ తీవ్రమయిపోతుంది. అది సరిపోదన్నట్లుగా కరోనా ఒకటివచ్చిపడింది.. అది కాస్త టీడీపీ అధినేతను ఇల్లు కదలకుండా చేసేసింది. ఇంత బ్యాడ్ టైంలో కూడా ఒక న్యూస్ టీడీపీ శ్రేణులకు ఎక్కడలేని ఆశలను కల్పించిందని చెబుతున్నారు.
ఇంతకూ ఆ విషయం ఏమిటంటే… బాబు, అమిత్ షా కు ఫోన్ చేయడం.. అమిత్ షా రిసీవ్ చేసుకుని మాట్లాడటం. అవును… కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఆయన్ని చంద్రబాబు ఫోన్ లో పరామర్శించారు.. ఆరోగ్యంపై ఆరా తీశారు.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఈ విషయమే టీడీపీ శ్రేణుల్లో కొత్త ఆశలు కల్పించిందని చెబుతున్నారు.
ఎందుకంటే… మోడీ, అమిత్ షాలను ప్రసన్నం చేసుకునేందుకు ఏడాదిగా చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆఖరిని కరోనా సమయంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లడానికి అనుమతి అడిగే సాకుతో కూడా ట్రై చేశారు. అయినా కూడా హస్తిన నుంచి బాబు స్పందన కరువైంది. అలాంటి బాబుకు అమిత్ షా ఫో న్ లో రెస్పాండ్ కావడం నిజంగా గుడ్ న్యూస్ కాకమరేమిటి?
-CH Raja