ఇదేంటయ్య బాబు ! ఈ ఉత్తుత్తి కబుర్లు ఎందుకో ?

-

అబద్ధాలు అందరూ చెబుతారు. కానీ అబద్దం చెప్పడం లో కూడా తన వెరైటీ నిరూపించుకుంటూ ఉంటారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇప్పటికే పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. నాయకుల్లో భవిష్యత్తు పై బెంగ పెరిగిపోయింది. మరో మూడున్నరేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొని పోరాడడం కష్టమనే అభిప్రాయానికి చాలా మంది పార్టీ నాయకులు వచ్చేసారు. అందుకే పార్టీ పిలుపునిస్తున్నా, పదేపదే ప్రభుత్వంపై పోరాడాలి అంటూ చంద్రబాబు కీలక నాయకులకు ఫోన్ లు చేస్తున్నా, పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఒకవేళ బాబు మాట తీసుకుని వైసీపీ ప్రభుత్వం పై ఉద్యమాలు చేపడితే, ఆ తర్వాత పరిణామాలు ఎదుర్కోవడం కష్టమనే అభిప్రాయంలో చాలామంది నాయకులు ఉన్నారు.
ఇప్పటికే పార్టీలో కీలక నాయకులు చాలామంది జైలుకు వెళ్లడం, ఆర్థికంగానూ , వ్యాపారాలు పరంగాను అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండడం ఇలా ఎన్నో కారణాలతో, నాయకులు ముందుకు వచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారు. పార్టీకి పునర్వైభవం  తీసుకువచ్చేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా, అది వర్కౌట్ కావడం లేదు. అందుకే చంద్రబాబు ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్ వేస్తూనే, తన బుర్రకు పదును పెడుతున్నాడు. పార్టీ నాయకులు అందరిని ఉత్సాహపరిచేందుకు ప్రయత్నిస్తున్నాడు. అలాగే ఈ కరోనా సమయంలోనూ ఇంటి నుంచి బయటకు వచ్చి పెద్ద రిస్క్ చేస్తున్నాడు. అయినా పార్టీ కేడర్లో అనుకున్నంత స్థాయిలో ఉత్సాహం కనిపించకపోవడంతో, ఇక సరికొత్త ఆలోచనకు పదును పెట్టారు.
త్వరలోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయని, 2022 లేక 2023 లో కానీ  జమిలి ఎన్నికలు రావడం తథ్యమని, అప్పుడు వైసిపి ప్రభుత్వం ఘోరంగా ఓటమి చెందుతుందని, మళ్లీ టిడిపికి అధికారం దక్కుతుందని, ఇలా పదేపదే పార్టీ కేడర్ కు నూరిపోస్తూ, వారిలో ఉత్సాహం పెంచేందుకు అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం జమిలి ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేయడం లేదు. అసలు ఆ ప్రస్తావనే కేంద్రంలో రావడం లేదు. అలాగే టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వంటి వారు సైతం అసలు జమిలి ఎన్నికలకు వెళ్లే ఆలోచన కేంద్రానికి లేదని చెబుతున్నారు. ఈ విషయం చంద్రబాబుకు సైతం స్పష్టంగా తెలుసు. అయినా పార్టీ కేడర్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు.
వంద అబద్ధాలు ఆది ఒక పెళ్లి చేయవచ్చు అనే సూత్రాన్ని గుర్తుపెట్టుకుని బాబు పార్టీ కేడర్లో ఉత్సాహం నింపేందుకు ఈ విధంగా అబద్ధాలు చెప్పినా  ఫర్వాలేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పెద్దమనిషి,  70 ఏళ్లు దాటిన గొప్ప మనిషి ఇన్ని అబద్దాలు చెప్పడం అవసరమా అనే వ్యాఖ్యలు ఇప్పుడు సొంత పార్టీ నాయకుల నుంచే వినిపిస్తున్నాయి.
-Surya

Read more RELATED
Recommended to you

Latest news