ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం.. అతిథులు వీళ్లే

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. 164 స్థానాలు దక్కించుకున్న తెలుగుదేశం కూటమి… ఇవాళ ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
ఇవాళ ఉదయం 11.27 గంటలకు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉంటుంది.

 

చంద్రబాబుతో పాటు మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండనుంది.. జనసేనకు నాలుగు, బీజేపీకి రెండు మంత్రి పదవులు దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవాళ మొత్తం 24 మందితో… ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు చంద్రబాబు. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉండే ఛాన్స్ ఉంది. ఇక ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి… ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, నడ్డా, రజినీకాంత్ చిరంజీవి రామ్ చరణ్ తదితరులు హాజరు కాబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news