జగన్ పాలనలో గిరిజనుల బ్రతుకు దయనీయం – చంద్రబాబు

-

జగన్ పాలనలో గిరిజనుల బతుకు దయనీయంగా ఉందన్నారు చంద్రబాబు. గిరిజన సోదరులకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన బాబు…వైసీపీ సర్కార్‌ పై మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఆది నుంచీ గిరిజన సంక్షేమం, గిరిజన హక్కుల పరిరక్షణ కోసం కృషిచేసింది. గిరిజన ప్రాంత భూములు, ఉద్యోగాలు, అటవీహక్కులు వంటి వాటికోసం ఆనాడు ఎన్టీఆర్ 14 చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని జీవోలు కూడా తెచ్చారని గుర్తు చేశారు. షెడ్యూల్డ్‌ ప్రాంతంలో జీవో 3 ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలలోని ఉద్యోగాలన్నింటినీ స్థానిక గిరిజన అభ్యర్థులతో భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.


ఆ జీవోను ప్రస్తుత వైసీపీ హయాంలోనే కోర్టు రద్దు చేస్తే… పునరుద్ధరణకోసం ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నమూ చేయకపోవడం విచారకరమన్నారు. గిరిజనుల సాంప్రదాయక భూములు గిరిజన తెగలకే దక్కాలి. ఆ దిశగా ప్రభుత్వం కృషిచేయకపోగా, పైనుంచి గిరిజన భూముల ఆక్రమణను జోరుగా సాగిస్తోంది. బాక్సైట్ తవ్వకాల ఒప్పందాలను 2016లో మా ప్రభుత్వం రద్దుచేసింది. ఇప్పుడు లేటరైట్ ముసుగులో బాక్సైట్ దోపిడీ జరుగుతోందని వెల్లడించారు.

బాక్సైట్ దోపిడీ కోసం అడవులను నరికేసి ఆగమేఘాలమీద రోడ్డు వేసేసారు. అంతవేగంతో రాష్ట్రంలో ఇంకెక్కడైనా కిలోమీటరు రోడ్డు వేసారా? గిరిజన గ్రామాల్లో ఎవరైనా అనారోగ్యం పాలైతే వారిని డోలె కట్టి కిలోమీటర్ల కొద్దీ మోసుకెళ్లాల్సిన దుస్థితి ఉందని నిప్పులు చెరిగారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బైక్ అంబులెన్సులు ఇప్పుడు లేవు. అలాగే గిరిజన ప్రాంతాల్లో వారాంతపు సంతల్లో రోగులకు మెరుగైన వైద్యం కల్పించేందుకు ఏర్పాటుచేసిన మొబైల్‌ అంబులెన్స్‌ సేవలు కూడా ఇప్పుడు లేవని విమర్శలు చేశారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news