రాజకీయాల్లో వ్యూహ ప్రతి వ్యూహాలు అనేవి సహజంగానే నడుస్తాయి..ఏ నాయకుడైన తమ వ్యూహాలతో ప్రత్యర్ధులని చిత్తు చేయాలని అనుకుంటారు..ఇక ప్రత్యర్ధులు సైతం ఏ మాత్రం తగ్గకుండా వ్యూహానికి ప్రతి వ్యూహం వేసి తమ ప్రత్యర్ధులకు చెక్ పెడతారు. ఇప్పుడు ఏపీలో కూడా ఇలాగే రాజకీయం నడుస్తోంది..అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది..అయితే ప్రస్తుతం ఏపీలో వైసీపీదే పైచేయి ఉందని చెప్పొచ్చు.
ఇక వైసీపీని దెబ్బకొట్టడానికి ప్రతిపక్ష టీడీపీ తెగ కష్టపడుతుంది.ఎపుడైతే అధికారం కోల్పోయిందో అప్పటినుంచి..వైసీపీని నిలువరించడానికి టీడీపీ ప్రయత్నిస్తూనే ఉంది..అసలు జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు పోరాటం మొదలుపెట్టిన విషయం తెలిసిందే…గత రెండున్నర ఏళ్లుగా జగన్ ప్రభుత్వం టార్గెట్‌గా చంద్రబాబు చిన్నపాటి యుద్ధమే చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు..అలాగే వాటిపై పోరాటాలు చేస్తున్నారు.
అదేవిధంగా ప్రజా సమస్యలపై తమదైన శైలిలో పోరాటాలు చేసి వైసీపీకి చెక్ పెట్టాలని చూస్తున్నారు…కానీ ఎక్కడా కూడా చంద్రబాబు సక్సెస్ అవుతున్నట్లు కనిపించడం లేదు…ఎందుకంటే చంద్రబాబు వేసే ఎత్తులకు జగన్ ఎప్పటికప్పుడు పై ఎత్తులు వేసి చిత్తు చేస్తున్నారు…ఒకవేళ చంద్రబాబు పోరాటాలే సక్సెస్ అయితే…స్థానిక ఎన్నికల్లో వైసీపీకి అంతటి భారీ విజయాలు వచ్చేవి కావు.. అంటే ప్రజలు టీడీపీని ఆదరించడం లేదంటే…బాబు పోరాటాలు పూర్తిగా సక్సెస్ అవ్వడం లేదనే చెప్పాలి.
అయినా సరే బాబు తన పోరాటాలని ఆపడం లేదు…అలాగే తన వ్యూహాలతో వైసీపీకి చెక్ పెట్టాలనే ఆలోచన మానడం లేదు. ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకొస్తూనే ఉన్నారు..కానీ బాబు ఎత్తులకు జగన్ పై ఎత్తులు వేసి చెక్ పెట్టేస్తున్నారు. బాబు కొన్ని రోజులు ఏదో ప్రభుత్వంపై పోరాటం అన్నట్లు హడావిడి చేసినా సరే..జగన్ సైలెంట్‌గా ఉంటూ ఒకే సారి బాబుకు చెక్ పెట్టేలా వ్యూహం పన్నుతున్నారు. అంటే చంద్రబాబు ఎన్ని ఎత్తులు వేసిన…వాటికి జగన్ పై ఎత్తులు వేసి చిత్తు చేస్తున్నారు.