రాష్ట్రంలో ఇసుక ,లిక్కర్ పాలసీల్లో ఎవరు వేలుపెట్టడానికి లేదు ఉచిత ఇసుక ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందే అని సీఎం చంద్రబాబు అన్నారు. జిల్లాలో ఉచిత ఇసుక ప్రజలకు అందుబాటులో ఉందో లేదో చెక్ చేయాలి. ట్రాక్టర్లు, ఎద్దుల బండిలతో ఇసుక తీసుకెళ్లే వాళ్ళ మీద కేసులు పెట్టొద్దు. ఎడ్లబండితో ఇసుక తీసుకువెళ్లే, వారి పై గ్రామాల్లో రైతులు మీద పెత్తనం చేయొద్దు. సొంత అవసరాలకు ఇసుక తీసుకు వెళ్ళే వారిపై పెత్తనం చేయవద్దు… కేసులు పెట్టొద్దు. అలా చేసే అధికారుల పై కఠిన చర్యలు తీసుకుంటాం అని అన్నారు.
అలాగే అమరావతి రాష్ట్రానికి ఏకైక రాజధాని… విశాఖపట్నం మన ఆర్థిక రాజధాని. కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం. ఇండస్ట్రియల్ హబ్ గా , అద్భుతమైన సిటీని నిర్మిస్తాం. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. ఎన్డీఏ కూటమి పాలసీ అమరావతి ఏకైక రాజధాని అని చంద్రబాబు స్పష్టం చేసారు.