తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కేంద్రం నుండి పిలుపు వచ్చింది. ఇవాళ ఢిల్లీ రావాల్సిందిగా కేంద్రం ఆహ్వానించింది. సుదీర్ఘ విరామం తర్వాత చంద్రబాబు మరోసారి నేడు ఢిల్లీ వెళ్లానున్నారు. ఆజాధికా అమృత్ మహోత్సవ ఉత్సవాల నేషనల్ కమిటీ సమావేశం నేడు జరగనుంది. అందులో చంద్రబాబు పాల్గొననున్నారు.
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో నిర్వహించే సమావేశానికి చంద్రబాబు హాజరవుతారు. ఈ కార్యక్రమానికి దేశంలోని దాదాపుగా అన్ని పార్టీల అధినేతలను కేంద్రం ఆహ్వానించింది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ కు సైతం ఆహ్వానం అందింది.
దీంతో ఇవాళ సాయంత్రం సీఎం జగన్ కూడా ఢిల్లీకి పయనం కానున్నారు. 75 ఏళ్ల స్వతంత్ర మహోత్సవాల సందర్భంగా 2023 వరకు ఆజాదిక అమృత్ ఉత్సవాలకు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే చంద్రబాబు పర్యటనపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది.