అధికారంలోకి వచ్చిన నాటి నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన మీదనే దృష్టి పెట్టారు. ప్రజాపాలనే లక్ష్యంగా ముదుకు వెళ్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా వరుసగా అమలు చేసుకుంటూ పాలనలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే పేదింటి అక్కల కోసం ‘వైఎస్ఆర్ చేయూత’ పధకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పధకం ద్వారా 45-60 ఏళ్ల వయసు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లకు గాను రూ. 75 వేల ఆర్ధిక సాయాన్ని ఉచితంగా అందజేయనున్నారు. అయితే ఇప్పుడు తాజాగా.. వైఎస్ఆర్ చేయూత పథకాన్ని మరో నాలుగు కులాల వారికి కూడా అందించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
బుడగ జంగం, వాల్మీకి, ఈనేటికోండ్, బెంటో ఒరియా కులాలకు చెందిన వారికి కూడా పథకాన్ని అందించాలని సూచించారు. వారిలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. అలాగే ఎలాంటి కుల ధ్రువీకరణ పత్రం లేకపోయినా కూడా ఆయా కులాలకు చెందిన వారికి వైఎస్ఆర్ చేయూత పథకాన్ని అందించాలని ఆదేశించారు.