మేనల్లుడి నిశ్చితార్థ వేడుకలో జగన్..2 రెండు నిమిషాలే ఉన్నాడు – రఘురామ

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ మేనమామ అయిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన సొంత మేనల్లుడి నిశ్చితార్థ వేడుకలలో మాత్రం కేవలం రెండు నిమిషాల ఒక్క సెకండ్ మాత్రమే ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. కనీసం 10 నిమిషాల నుంచి పావుగంట సేపు అయినా ఉండి ఉంటే బాగుండేదని జనం అనుకుంటున్నారని, వారికి, వారికి మధ్య ఏమున్నాయో మనకు అనవసరమని పేర్కొన్నారు.

CM Jagan came for his nephew’s engagement

జగన్ మోహన్ రెడ్డి గారు హైదరాబాదులోని మేనల్లుడి నిశ్చితార్థ వేడుకలకు హాజరు కావడానికి 50 నుంచి 60 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందట అని, ఈ ఖర్చు అంతా సొంతంగా పెట్టుకుంటారా?, లేకపోతే ప్రజాధనాన్ని ఖర్చు చేస్తారా?? అన్నది తెలియదని అన్నారు. నిండా మునిగిన వాడికి చలి ఏమిటి అన్నట్లు ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఖర్చు ఓ లెక్క అని రఘురామకృష్ణ రాజు గారు ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version