ఢిల్లీః కాసేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్నారు ఏపి సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్టులో ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మార్గాని భరత్, వంగా గీత, మాధవి, అయోధ్యరామిరెడ్డి, వేమిరెడ్డి, గురుమూర్తి, మాధవ్, రంగయ్య, రెడ్డప్ప, సత్యవతి, కోటగిరి శ్రీధర్, మోపిదేవి వెంకటరమణలు.. సిఎం జగన్ స్వాగతం పలికారు.
ఈ రోజు సాయంత్రం 4.45 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సిఎం వైఎస్ జగన్ ముఖాముఖి సమావేశం కానున్నారు. ఏపి అభివృద్ధి కి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించనున్న ఏపి సిఎం జగన్.. కేంద్ర హోంమంత్రి, ఆర్థికశాఖ మంత్రిని కలవనున్నారు.
పోలవరం ప్రాజెక్టు కు సవరించిన అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని.. ఏపికి ఆర్థిక చేయూతనివ్వాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని కోరనున్నారు సిఎం జగన్ మోహన్ రెడ్డి. ఏపి విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను పూర్తి చేయాలని.. ఏపిలో కొత్తగా 13 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సహకరించాలని కోరనున్నారు. .