ఏపీని విడగొట్టినట్లే..నా కుటుంబాన్ని కాంగ్రెస్‌ విడగొట్టింది – సీఎం జగన్‌

-

ఏపీని విడగొట్టినట్లే..నా కుటుంబాన్ని కాంగ్రెస్‌ విడగొట్టిందని ఏపీ సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ షర్మిలని తీసుకురావడంపై స్పందించిన వైఎస్ జగన్… ఆ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇండియా టూడే నిర్వహించిన సమ్మిట్‌ లో సీఎం జగన్‌ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీది విభజించు పాలించు సిద్దాంతం అన్నారు.

ys sharmila on cm jagan mohan reddy
ys sharmila on cm jagan mohan reddy

ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాన్ని విడగొట్టి పాలించాలని చూసిందని… ఇప్పుడు నా కుటుంబాన్ని విడగొట్టి పాలించాలని చూస్తుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహించారు.జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకి ఆంధ్ర ప్రదేశ్ లో స్థానం లేదని తెలిపారు. టీడీపీ, జనసేన పార్టీలతోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పోటీ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఇష్యూ బేస్డ్ విషయంలో కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. సర్వేలలో ప్రజా వ్యతిరేకత వచ్చిన నాయకులకు టికెట్లు ఇవ్వలేదని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news