‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకంపై సీఎం జగన్ సమీక్ష

-

‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద చేపట్టిన గృహనిర్మాణాలు శరవేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. విశాఖలో ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా జరగాలని సీఎం ఆదేశించగా.. అక్కడ లక్షా 24 వేల ఇళ్లను అక్టోబర్ చివరి నాటికి ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఆప్షన్‌-3 కింద ఎంపిక చేసుకున్న ఇళ్ల నిర్మాణాలు కూడా వేగంగా సాగుతున్నట్లు వివరించారు.

ఇళ్ల నిర్మాణంతో సమాంతరంగా కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపైనా దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. పనుల ప్రగతి సమీక్షించడానికి, సందేహాల నివృత్తికి వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని అధికారులు చెప్పారు. ప్రత్యేకంగా ఒక ఫోన్‌ నెంబర్‌ కూడా అందుబాటులో ఉంచాలని సీఎం స్పష్టం చేశారు.

టిడ్కో ఇళ్ల నిర్మాణ ప్రగతిపైనా సీఎం సమీక్షించారు. 15 నుంచి 20 రోజుల్లో 1.4 లక్షల ఇళ్లు సిద్ధమవుతాయని అధికారులు తెలియజేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియనూ త్వరగా పూర్తి చేయాలని సీఎం నిర్దేశించారు. 90 రోజుల్లో ఇంటి పట్టా కార్యక్రమంపై సీఎం సమీక్ష నిర్వహించారు. వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి.. 2 లక్షల 3వేల 920 కొత్తవిగా తేల్చామని అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news