రేపు కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన

అమరావతి : ఏపీ ప్రజలకు శుభవార్త..రేపే వైఎస్సార్‌ మత్య్సకార భరోసా నిధులు జమ కానున్నాయి. ఇందులో భాగంగానే.. రేపు కోనసీమ జిల్లాలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు. కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం మురమళ్ళలో వైఎస్సార్‌ మత్య్సకార భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టననున్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి.

ఇందులో భాగంగానే… ఉదయం 9.40 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి… 10.20 గంటలకు ఐ పోలవరం మండలం కొమరగిరి చేరుకోనున్నారు. 10.45 గంటలకు మురమళ్ళ వేదిక వద్దకు చేరుకుని వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం జగన్ మోహన్‌ రెడ్డి. ఈ సందర్భంగా బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్‌… మధ్యాహ్నం 1.20 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు. ఇక సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.. కోనసీమ జిల్లా పర్యటన నేపథ్యంలో… అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.