ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లో క్యాన్సర్, గుండె, టీబీకి సైతం చికిత్స – సీఎం జగన్

-

ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లో క్యాన్సర్, గుండె, టీబీకి సైతం చికిత్స అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ప్రారంభించారు ఏపీ సీఎం జగన్‌. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడారు. ఆధునిక వైద్యాన్ని ఉచితంగా మీ గడప వద్దకు తీసుకువచ్చే విధానమే ఫ్యామిలీ డాక్టర్ విధానం అని చెప్పారు. దేశ చరిత్రలో ఒక గొప్ప మార్పు కు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు.. వైద్యం కోసం ఏ పేదవాడు ఇబ్బంది పడకూడదని వెల్లడించారు సీఎం జగన్.

మంచానికి పరిమితమైన రోగులకు ఇంటివద్దే వైద్యం.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లో క్యాన్సర్, గుండె జబ్బులు, టీబీకి సైతం చికిత్స.. విలేజ్‌ క్లీనిక్‌లో 14 రకాల పరీక్షలు నిర్వహిస్తారన్నారు.. ఈ క్లీనిక్‌లో స్పెషలిస్టు డాక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులు ఉంటాయని వెల్లడించారు సీఎం జగన్‌. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో వ్యాధులు ముదరకముందే గుర్తించొచ్చు.. విలేజ్‌ క్లీనిక్‌లో సీహెచ్‌వో, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు ఉంటారు.. ప్రతీ 2వేల జనాభాకు ఒక విలేజ్ క్లీనిక్.. మండలానికి రెండు పీహెచ్‌సీలు ఉండేలా చర్యలు ఉంటాయన్నారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news