బ్రేకింగ్ : టీటీడీలో 1,527 మంది ఉద్యోగులకు కరోనా.. ఆర్జిత సేవలు రద్దు..!

కలియుగ దైవం శ్రీవారి సన్నిధిలో కరోనా కలకలం రేపుతోంది. లాక్‌ డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత తిరుమల వెంకన్న దర్శనానికి భక్తులు క్యూ కడుతున్నారు. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన టీటీడీ వైరస్ వ్యాప్తి చెందకుండా భౌతిక దూరం పాటిస్తూ.. దర్శనానికి అవకాశం కల్పించారు. అయినా కూడా కరోనా కలకలం సృష్టిస్తోంది. అలాగే టీటీడీ సిబ్బంది, ఆలయ అర్చకులకు కూడా వైరస్ సోకడంతో భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్లేందుకు బయపడుతున్నారు.

ttd

కాగా, ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డ టీటీడీ ఉద్యోగుల సంఖ్య 1572కు చేరింది. వీరిలో 1403 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 169 మంది ఉద్యోగులు చికిత్స తీసుకుంటుండగా ఇప్పటివరకు ఐదుగురు టీటీడీ ఉద్యోగులు కరోనాతో మరణించారు. ఈ నేపథ్యంలోనే శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేశారు.