వివరం తెలుసుకోకుండా యవ్వారంలోకి ఎంటరైతే క్షవరం అయిపోతుందన్న విషయం లోకేష్ – పవన్ లకు తాజాగా తెలిసొచ్చిన సంఘటన తాజాగా అమరావతి వేదికగా జరిగింది! కాకపోతే ఈ విషయంలో లోకేష్ కు ప్రత్యక్షంగా పవన్ కు పరోక్షంగా పడ్డాయంతే! దానికి కారణం… పులి చినలాజర్ గారి మరణం… ఆ మరణాన్ని రాజకీయాలకు వాడుకోవడం!
అవును… విషయం పూర్తిగా తెలుసుకోకుండా అమరావతిపై ఉన్న అత్యుత్సాహమో లేక ప్రభుత్వంపై బురద జల్లాలనే కుతుహలమో తెలియదు కానీ… “అమరావతి రాజధానికి భూమి త్యాగం చేసిన రైతు గుండె ఆగి మరణించాడు” అంటూ చినబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు! ఈ విషయంలో తను కూడా ఆ తానులోముక్కే కావడంతో… జనసేన అధినేత పవన్ కూడా స్పందించారు. “అమరావతిలోనే రాజధాని ఉండాలని బలంగా పోరాడుతున్న లాజరస్ గారు తుదిశ్వాస విడిచారు.. అమరావతి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసినప్పుడే ఆయనకు సరైన నివాళి” అని రాసుకొచ్చారు!
ఈ కామెంట్లపై మృతుడి కుమార్తె ఎస్తేర్ అదే ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు! “మా నాన్న గురించి ఎవడు చెప్పాడు నీకు? మా నాన్న మృతిని కంపు రాజకీయాలకు వాడుకోవడానికి నీవెవరు? ఏ నాడైనా మా ఊరు వచ్చావా? మా నాన్న గారిని పరామర్శించి మాట్లాడావా? లంక భూముల సొసైటీ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు.. భూముల గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా కనీసం ముఖాలైనా చూడలేదు మీరు. హైదరాబాద్‌లో దాక్కున్న నీకు మా నాన్న గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? మా నాన్న రాజధాని గురించి కాదు. ఆరోగ్యం బాగోక చనిపోయారు.” అంటూ వితౌట్ గ్యాప్ గట్టిగానే వాయించి వదిలారు!!