స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టిడిపి అధినేత నారా చంద్రబాబుని ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో సోమవారం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి ఫోన్ కాల్ చేసి పరామర్శించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. చంద్రబాబు అక్రమ అరెస్టు ని తీవ్రంగా ఖండించారు నారాయణ.
టిడిపి పిలుపునిచ్చిన బంద్ కి సంపూర్ణ మద్దతు తెలిపామని లోకేష్ తో అన్నారు. వైసిపి నియంత పాలనపై అందరూ కలిసికట్టుగా పోరాడదాం అని అన్నారు. ఈ నేపథ్యంలో బంద్ కి మద్దతు ఇచ్చినందుకు నారాయనకు ధన్యవాదాలు తెలిపారు నారా లోకేష్. మరోవైపు చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేపట్టారు.
ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సామ భూపాల్ రెడ్డి, జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్, పోలిట్ బ్యూరో సభ్యులు బుక్కిని నరసింహులు, క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసన్న, తెలుగు మహిళా నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.