BREAKING: సాయంత్రంలోగా ఏపీకి కొత్త సీఎస్ రాబోతున్నారు. శెలవుపై వెళ్లారు సీఎస్ జవహర్ రెడ్డి. దీంతో ఇవాళ సాయంత్రంలోగా కొత్త సీఎస్ నియామకం కానున్నారు. రాజీనామా చేసినా.. చేయకున్నా.. సలహాదారులను వెంటనే పదవుల నుంచి తప్పించాలని ఆదేశాలు వచ్చాయి.
త్వరలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది కొత్త ప్రభుత్వం. అనారోగ్య కారణాల వల్ల శెలవుపై వెళ్లారు ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రావత్. ఇటు శెలవుపై వెళ్లారు సీఎస్ జవహర్ రెడ్డి. దీంతో ఇవాళ సాయంత్రంలోగా కొత్త సీఎస్ నియామకం కానున్నారు.
అటు టీచర్లకు సంబంధించి ఎటువంటి బదీలీలు చేపట్టవద్దని డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలకు ముందు మొత్తం 1800 మంది టీచర్లను బదిలీలు చేపట్టాలని నిర్ణయించారు. బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఒత్తిడితో ఈ సిఫారసులు జరిగాయని అభియోగం ఉంది. గతంలో ఇచ్చినటువంటి బదిలీ ఉత్తర్వులను నిలిపివేశారు. టీచర్ల బదిలీలు చేపట్టవద్దని పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.