TDPలో అలజడి నెలకొంది. టీడీపీ పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమాకు టికెట్ దక్కలేదు. టీడీపీ అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల మూడో జాబితా విడుదల అయింది. అయితే.. ఈ లిస్ట్ లో ఎక్కడా కూడా టీడీపీ పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమా పేరు లేదు. దీంతో టీడీపీ పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమా పార్టీ మారబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
కాగా 13 మంది లోక్‌సభ అభ్యర్థులు, 11 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది టీడీపీ. ఎంపీ, అసెంబ్లీ అభ్యర్థులుగా పలాస-గౌతు శిరీష, పాతపట్నం-మామిడి గోవింద్‌రావు, శ్రీకాకుళం-గొండు శంకర్, శృంగవరపుకోట-కోళ్ల లలితా కుమారి, కాకినాడ సిటీ-వెంకటేశ్వరరావు, అమలాపురం-అయితాబత్తుల ఆనందరావు, పెనమలూరు-బోడె ప్రసాద్, మైలవరం-వసంత వెంకట కృష్ణప్రసాద్, నర్సరావుపేట – చదలవాడ అరవింద్ బాబు, చీరాల మాలకొండయ్య, సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఉన్నారు.