ఈ-శ్రమ్ లేబర్ కార్డులు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కానుక – GVL

-

సామాజిక భద్రత కోసం అసంఘటిత రంగ కార్మికులకు ఈ-శ్రమ్ లేబర్ కార్డులు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కానుక అన్నారు  ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఈ-శ్రమ్ నమోదు లక్ష్యం 1.51 కోట్లు కాగా, ఇప్పటి వరకు 70.93 లక్షల కార్డులు మాత్రమే జారీ చేసినట్లు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి వెల్లడించారు.ఈ-శ్రమ్ రిజిస్ట్రేషన్‌లకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా మద్దతు ఇవ్వాలని, ఇది కేంద్ర పథకం కాబట్టి ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయవద్దని ఎంపీ జీవీఎల్ అన్నారు.

అసంఘటిత రంగంలోని కార్మికులకు ఈ-శ్రమ్ రిజిస్ట్రేషన్ పథకం ద్వారా అనేక ప్రయోజనాలు చేకూరుతాయని బిజెపి ఎంపి శ్రీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ సమాధానం తెలిపారు. ఈ పథకం కింద, ఇ-శ్రమ్ కార్డుదారులు భవిష్యత్తులో ఇతర సామాజిక భద్రతా ప్రయోజనాలతో పాటు రూ.2 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం పొందుతారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ-శ్రమ్ పథకం కింద 1.51 కోట్ల మంది అసంఘటిత కార్మికులను నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని, ఇప్పటివరకు కేవలం 70.92 లక్షల మంది వలస కార్మికులను మాత్రమే నమోదు చేశారని కేంద్రమంత్రి తెలిపారు.ఇ-శ్రమ్ రిజిస్ట్రేషన్ల కవరేజీ రాష్ట్రవ్యాప్తంగా చాలా అస్తవ్యస్తంగా ఉంది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 10 జిల్లాల్లో కవరేజీ దయనీయంగా 30,000 కంటే తక్కువగా ఉంది. జిల్లాల వారీగా కవరేజీని మంత్రి సమాధానంలో అందించారు.

ఈ సందర్భంగా ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ పథకం కింద 100% లబ్ధిదారుల నమోదుకు అవసరమైన సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుండి అందడం లేదని రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు.

వివిధ జిల్లాల్లోని బీజేపీ శ్రేణులు అసంఘటిత కార్మికులకు అవగాహన కల్పించి వారికి ఈ-శ్రమ్ కార్డులు అందజేసేందుకు చురుకుగా సహకరించారని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకించి కార్మిక శాఖ సహాయ నిరాకరణ కార్మిక వర్గాలపై వైసీపీ యొక్క ఉదాసీనత, నిర్లక్ష్యానికి నిదర్శనమని ఎంపీ జీవీఎల్ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news