గాడాంధకారం: చేతులెత్తేసిన బాబు… హోం క్వారంటైన్ వీడని చినబాబు!

-

తనవల్ల ఇంక ఏమీ కాదని.. టీడీపీని ప్రజలు నమ్మినా ప్రయోజనం శూన్యం అని.. ప్రెస్ మీట్ లు పెట్టమంటే పెడతా.. ఆన్ లైన్ లో క్లాసులు చెప్పమంటే చెబుతా.. అంతకు మించి తననుంచి ఈ జన్మకు ఇంకేమీ ఆశించొద్దన్న స్థాయిలో చంద్రబాబు తాజా మాటలు ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి! దానికి కారణం… జగన్ కు విదించిన 48 గంటల డెడ్ లైన్ ముగిసిన అనంతరం చంద్రబాబు పలికిన మాటలు.. కనుమరుగైపోయిన చినబాబు చేష్టలు!

“నేను రెండు రోజులకు ఒకసారి మీడియా ముందుకు వస్తా.. ప్రజల్లో చైతన్యం తెస్తా.. కేంద్రం రాజధాని తరలింపు అడ్డుకోవాలి” డెడ్ లైన్ ముగిశాక చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇవి. అంటే… తనవల్ల ఇంక ఏమీకాదని బాబు చేతులెత్తేసినట్లే అని ఈ మాటలపై విశ్లేషణలు చేస్తున్నారు! వాస్తవంగా కూడా… బాబు రెండు రోజులకు ఒకసారి ఆన్ లైన్ లోకో, ప్రెస్ ముందుకో వస్తే ప్రజలకు ఒరిగేది కూడా ఏమీ ఉండదు.. ఆయనకు కంఠశోష మిగలడం మినహా!

ఈ క్రమంలో ఈ అవకాశాన్ని తన ఎదుగుదలకు, పార్టీ మనుగడ ప్రశ్నార్థకం కాకుండా చూడటానికీ చినబాబు ముందడుగు వేయాలి. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాని చినబాబు చేస్తున్నదేమిటి? కరోనా విజృంభణ ఉన్నా.. ఇప్పటికే కొందరు నేతలకు వైరస్ సోకుతున్నా కూడా వైకాపా మంత్రులు, ఎమ్యెల్యేలు ప్రజా క్షేత్రంలో దూసుకుపోతున్నారు. కానీ చినబాబు మాత్రం ఆరునెలలుగా హోం క్వారంటైన్ లోనే ఉన్నారు! ఇంతకు మించిన దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏమైనా ఉంటుందా అనేది టీడీపీ నేతల మనోవేదనగా ఉంది! దీంతో… తమ్ముళ్లు నిప్పులు కక్కుతున్నారు. ఇకనైనా హోం క్వారంటైన్ ను వదిలి జనాల్లోకి రావాలని కోరుకుంటున్నారు!!

Read more RELATED
Recommended to you

Latest news